కొలువుదీరిన కొత్త పాలకవర్గం
* శ్రీ ఉమామహేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మండలి బాధ్యతల స్వీకరణ
* చైర్మన్ బీరం మాధవరెడ్డి సభ్యుల ప్రమాణ స్వీకారం
అచ్చంపేట: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైలం ఉత్తరముఖ ద్వారం గా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వరం ఆలయం ధర్మకర్తల మండలి నూతన పాలకమండలి సభ్యులు కొలువుదీరారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, దేవాదాయశాఖ పరిశీలకులు మదన్మోహన్, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గా బీరం మాధవరెడ్డి తో సహా 14 మంది పాలకవర్గం సభ్యులు అర్చకులు వీరయ్య శాస్త్రి ఎక్స్- అఫీసియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాల్టి నుంచి రెండేళ్ల పాటు సభ్యులు పదవిలో ఉండనున్నారు.
* రెండోసారి కొనసాగనున్న సభ్యులు
శ్రీ ఉమామహేశ్వర ధర్మకర్తల మండలి పాలకవర్గంలో సభ్యులందరూ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే కొత్తవారికి అవకాశం కల్పించారు. అందులోనూ గతంలోనే సామాజిక వర్గాల మాదిరిగా మాత్రమే వారికి చోటు కల్పించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం సభ్యులను వివిధ పార్టీల నేతలు అధికారులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం నూతన సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రూ. 1.30 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభానికి శ్రీకరం చుట్టారు. తమకు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేసామని నూతన సభ్యులు హామీ ఇచ్చారు. భక్తుల శ్రేయస్సు ప్రథమ విధిగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామ్మూర్తి శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






