15 July, 2026 | 4:35 AM

పోలీసులపై దాడి

26-10-2024 12:12 AM

ముగ్గురు యువకుల అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : ముగ్గురు యువకులు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి శాలివాహనన నగర్‌లో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రోడ్డుపై గొడవ చేస్తుండటాన్ని బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ రాజు, హోంగార్డు శేఖర్ గమనించారు. వారిని వారించి ఇంటికి వెళ్లాలని సూచించగా పోలీసులపైకి దాడికి దిగారు. దాడికి పాల్పడిన వారిని డీజే కార్తీక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అశోక్, మోహన్‌గా గుర్తించారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.