9 April, 2026 | 12:22 AM

ఏబీవీపీ నాయకులపై దాడులు సరికాదు

29-06-2024 01:10 AM

బీజేపీ రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న ఏబీవీపీ నాయకులపై  పోలీసుల చేత విచక్షణారహితంగా దాడులు  చేయించడంపై దారుణమని, ప్రభుత్వ తీరును ఖండి స్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల పభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిప డ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే  పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మౌలిక వసతులు కల్పించాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. విద్యార్థి నాయకులను బూటు కాళ్ల తో తన్నడం, పిడిగుద్దులతో దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.