calender_icon.png 12 February, 2026 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అభ్యర్థినిపై దాడికి యత్నం

12-02-2026 12:00:00 AM

  1. ఒక్కో ఓటుకు 5నుండి 10వెల ఫోన్ పే ద్వారా కొడుతూ ప్రలోబా పెడుతున్నడని ఆరోపణలు

30వ వార్డ్ లో భయబ్రాంతులకు గురవుతున్న ఓటర్లు

ఆడవాళ్లను బెదిరిస్తున్నాడని బీజేపీ అభ్యర్థి కర్నె హరీష్ ఆవేదన

దౌర్జన్యానికి పాల్పడుతున్న పట్టించుకోని వైనం

30 వ వార్డ్ బీజేపీ అభ్యర్థి కర్నె హరీష ఆవేదన

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): సిరిసిల్లలోబి.ఆర్.ఎస్ పార్టీ 30 వ వార్డ్ అభ్యర్థి భర్త మంచే శ్రీనివాస్ ప్రజలను, బెదిరింపులకు గురిచేస్తూ, ఒక్కో ఓటుకు 5 నుండి 10 వెల వరకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తు ప్రలోబాలకు గురిచేస్తూ ఎలాగైనా మళ్ళీ నెగ్గాలానే చూస్తున్నారని అన్నారు. ఆడవాళ్ళని చూడకుండా పైకి దురుసుగా ప్రవర్తిస్తున్నాడని బీజేపీ అభ్యర్థి కర్నె హరీష ఆరోపణలు చేస్తున్నారు.

సిరిసిల్ల పట్టణం లో 30 వ వార్డ్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి మంచే రేణుక శ్రీనివాస్ లకు పోటీగా అదే వార్డ్ లో పోటీ చేస్తున్న కర్నె హరీష,ల ను బేరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.30 వ వార్డ్ లో ప్రజలకు మంచే శ్రీనివాస్ కు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఓటింగ్ సెంటర్ లోపలికి అభ్యర్థి రేణుక పాస్ కార్డు తో లోపలికి వెళ్ళాలి. కానీ ఆమెకు బదులుగా ఎలాంటి పాస్ కార్డు లేకుండా లోపలికి వెళ్తున్నాడని అడగగా నా ఇష్టం మీరెవరు అడగడానికి అంటూ ఆడవాళ్ళని చూడకుండా మంచే శ్రీనివాస్ కొడుకు ఆయన డాడీ కి యత్నం చేశారాని ఆరోపించారు.

మమ్మల్ని కొట్టడానికి రావడం ఆయన ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ  బలుపు మాటలతో ఆడవాళ్లను కించపరచే విధంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ప్రజలకు సేవ చెయ్యాల్సింది పోయి బెదిరింపుల...? సేవ చేసే సత్తా లేనప్పుడు పక్కకు తప్పుకోవాలంటూ మండిపడ్డారు. పలుకుబడి ఉంటే ఏదైనా చేయొచ్చా అంటూ హరీష ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్లకు గత వారం రోజుల నుండి ఇంటిదగ్గరనే భోజనలు ఏర్పాటు చెస్తూ ఓటు వేసే విధంగా ప్రలోబాలకు గురిచేస్తున్న మంచే శ్రీనివాస్.భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో మాకు హక్కు లేదా ఆయనికి పోటీ ఎవరు ఉండకూడదనే నెపం తో ఓటమి పలు అవుతాడనే కోపం తో మామమ్ములను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ ఎవ్వరికి భయపడదని ఇలాంటి వాళ్లకు అసలే భయపడే ప్రసక్తే లేదని అన్నారు.