1 August, 2026 | 4:52 PM

మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు

01-08-2026 04:02 PM

చేగుంట,(విజయక్రాంతి): ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలు, గ్రామస్థాయి వరకు వెళ్లాలన్న ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలన్న, సర్పంచులు అధికారులు సమన్వయంతో పని చేస్తేనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సి, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య మండల ప్రత్యేక అధికారి, హేమ భార్గవి అన్నారు. శనివారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో   ఎంపీడీవో చిన్న రెడ్డి అధ్యక్షతన మందల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న పలుగ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించకపోవడం విడ్డూరంగా ఉంది. అనంతరం సమావేశంలో అధికారులు శాఖల వారిగా నివేదికను సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఉల్లి తిమ్మాహి పల్లి సర్పంచ్ సత్యనారాయణ గ్రామం లొ ఉన్న కరెంట్ సమస్య పై   ఏ ఈ ని అడగగా సరైన సమాధానం రాకపోవడంతో మిగతా సర్భంచులు అగ్రహం వ్యక్తం చేశారు.ముందుగా సమావేశనికి వచ్చిన చైర్మన్ బక్కి వెంకటయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్ రావు ను శాల్వతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బల్ లక్ష్మి, ఎంపీడీఓ చిన్న రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్ రావు, ఎంపీవో ప్రకాష్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేష్, భాగయ్యా,, మండల అధికారులు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీ లు పాల్గొన్నారు.