30 June, 2026 | 9:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మార్చి 31న విచారణకు హాజరవ్వండి

28-03-2025 12:13 AM

కునాల్ కమ్రాకు రెండోసారి ముంబై పోలీసుల సమన్లు..

న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ నిమిత్తం మార్చి 31న తమ హాజరు కావాలని కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు సూచించారు. కామెడీ షోలో భాగంగా షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా కమ్రా అభివర్ణించారు. దీంతో శివసేన ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కమ్రాపై పరువునష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని మంగళవారం కమ్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు తనకు వారంపాటు సమయం ఇవ్వాలని పోలీసులను కమ్రా కోరారు. కమ్రా విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. మార్చి 31న విచారణకు హాజరుకావాలంటూ తెలుపుతూ మరోసారి సమన్లు జారీ చేశారు.