30 June, 2026 | 10:38 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్రం శుభవార్త

28-03-2025 12:10 AM

ఉబెర్, ఓలాకు పోటీగా ‘సహకార్ ట్యాక్సీ’

లోక్‌సభలో ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా..

డ్రైవర్లు నేరుగా లాభాలు పొందే అవకాశం..

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా గురువారం ట్యాక్సీ డ్రైవర్లకు శుభావార్త చెప్పారు. ఉబెర్, ఓలాకు పోటీగా ‘సహకార్ ట్యాక్సీ’ పేరిట కొత్త ట్యాక్సీ సర్వీసును ప్రారంభించనున్నట్లు లోక్‌సభ వేదికగా ప్రకటించారు. ‘సహకార్ ట్యాక్సీ’ నడిపే డ్రైవర్లు ఇకపై ఎవరికి కమిషన్లు చెల్లించకుండా నేరుగా లాభాలు పొందే అవకాశముంది. ఓలా, ఉబర్, ర్యాపిడో నడిపించే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టపోతున్నామని డ్రైవర్లు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

సహకార్ ట్యాక్సీ ద్వారా పెద్ద కంపెనీలకు లాభాలు ఇవ్వకుండా డ్రైవర్లు నేరుగా సంపాదించడంలో సహాయపడటమే దీని లక్ష్యమన్నారు. రైడ్ నుంచి వచ్చిన లాభం నేరుగా డ్రైవర్‌కే వెళ్తుందని పేర్కొన్నారు. ప్రజలకు చౌక రవాణా సేవలను అందించడమే ‘సహకార్ ట్యాక్సీ’ ప్రధాన లక్ష్యం. ప్రధాని మోదీ విజన్‌గా చెప్పుకునే ‘సహకార్ సే సంవృద్ధి’లో ఇది భాగమని అమిత్ షా వెల్లడించారు.