22 June, 2026 | 9:30 PM

ఆసీస్ కాచుకో..

24-06-2024 02:01 AM
  • నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ

కంగారూలకు చావోరేవో

 రాత్రి 8 నుంచి

విజయక్రాంతి, ఖేల్‌విభాగం: పొట్టి ప్రపంచకప్‌లో పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న భారత్ మరో కీలక పోరుకు రెడీ అయింది. సూపర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో దాదాపు సెమీస్‌కు చేరిన టీమిండియా సోమవారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ భాగంగా జరగనున్న ఈ పోరుకు సెయింట్ లూసియా స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరిగా మారింది.

అఫ్గాన్ చేతిలో కంగారూల అనూహ్య పరాజయంతో సెమీస్ రేసు రసవత్తరంగా మారగా.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. బంగ్లాతో పోరులో భారత టాపార్డర్ గాడిన పడగా.. అదే జోరు ఆసీస్‌పై కూడా కొనసాగించాలని మనవాళ్లు చూస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ చావో రేవో కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు ఆస్ట్రేలియా సమాయత్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ముందంజ వేయడం చాలా కష్టం!