17 August, 2026 | 10:33 AM

కామారెడ్డిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గృహనిర్బంధం

17-08-2026 10:03 AM

తిరుమనపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన సురేందర్ 

అడ్డుకొని గృహ నిర్బంధించిన పోలీసులు 

కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former Yellareddy MLA Surender) ను పోలీసులు గృహ నిర్బంధించారు. సదాశివ నగర్ మండలం తిరుమనపల్లిలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లేందుకు వచ్చిన సురేందర్ ను కామారెడ్డిలో పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి నుంచి తిరుమనపల్లికి వెళ్లాల్సి ఉన్న సురేందర్ ను కామారెడ్డిలో పోలీసులు గృహ నిర్బంధించారు. తిరుమనపల్లి నుంచి లింగంపేటలో షాది ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందని నిరసిస్తూ లింగంపేటలో ధర్నా ర్యాలీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జాజాల సురేందర్ ను పోలీసులు కామారెడ్డి లోని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.