10 April, 2026 | 3:25 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

సఫారీ టూర్‌కు ఆస్ట్రేలియా

24-02-2026 12:53 AM

8 ఏళ్ల తర్వాత పర్యటన

అప్పట్లో కుదిపేసిన సాండ్‌పేపర్ గేట్

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 23 : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ కోసం ప్యాట్ కమ్మిన్స్ సారథ్యంలోని ఆసీస్ సఫారీలతో వారి సొంతగడ్డపై తలపడనుంది. సాండ్‌పేపర్ గేట్ వివాదం తర్వాత ఆసీస్ ఆ దేశంలో అడుగుపెట్టనుండడం ఇదే తొలిసారి.  ఇరుజట్ల మధ్య మొదట వన్డే, ఆపై టెస్టు సిరీస్ జరుగనుంది. రెండు దేశాల బోర్డులు ఈ విషయా న్ని ధ్రువీకరించాయి.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా సెప్టెంబర్‌లో కీలకమై న సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో కంగారూలు ఢికొట్టపోతున్నారు. 2018లో టెస్ట్ సిరీస్ సందర్భంగా కంగారూలు అనూహ్యంగా వివాదంలో చిక్కుకు న్నారు. కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారా న్ని మార్చేందుకు సాండ్ పేపర్‌తో రుద్దడం వీడియోల్లో రికార్డయింది. దీనికి కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహకరించారు.

దాంతో.. ఈ ముగ్గురిపై ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం విధించింది. విచారణ అనంతరం స్మిత్, వార్నర్ ఏడాదిపాటు సస్పెండ్ అ య్యారు. బాన్‌క్రాఫ్ట్ 9 నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ ఘటనతోనే స్మిత్ కెప్టెన్సీ పో గుట్టుకోగా.. టిమ్ పైన్ కొత్త సారథిగా ఎంపికయ్యాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆసీస్ మళ్లీ కేప్‌టౌన్‌లోనే టెస్టు మ్యాచ్ ఆడనుంది. అప్పుడు జట్టులో ఉన్న కమిన్స్, లి యాన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ ఈసారి కూడా ఆడబోతున్నారు.