24-02-2026 12:52:00 AM
శాట్స్‌తో ర్యాన్ గ్రూప్ కీలక ఒప్పందం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : తెలంగాణ ఫుట్‌బాల్‌కు మరింత ప్రోత్సహం లభించే దిశగా అడుగులు పడ్డాయి. ఆలిండియా ఫు ట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్)తో భాగస్వామ్యాన్ని పెంచుకున్న ర్యాన్ గ్రూప్ ఆఫ్ ఇని స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్స్)తో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు వి ద్యాపరమైన మద్ధతు అందించే లక్ష్యంతో శాట్స్‌తో సమగ్ర ఒప్పందంపై సంతకం చే సింది.
వచ్చే మూడేళ్లలో ఫుట్‌బాల్‌లో టా లెంట్‌ను వెలికితీయడమే కాకుండా అర్హ త కలిగిన ఉపాధ్యాయుల నియామకం, వి ద్యార్థుల కౌన్సెలింగ్, పరీక్షా సమన్వయం, వ్యక్తి త్వ వికాస కార్యక్రమాలు నిర్వహించనున్నా రు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో తమ భా గస్వామ్యాన్ని విస్తరించినందుకు సంతోషం గా ఉందని ర్యాన్ గ్రూప్ సీఈవో ర్యాన్ పింటో అన్నారు. యువ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కెరీర్ కలను నిజం చేయడంతో పాటు వారికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో యువ ఫుట్‌బాలర్లకు ఇదొక గొప్ప అవకాశమని ఎండీ డా.ఏ సోనీబాలాదేవి చెప్పారు.