29-05-2025 09:40:07 AM
హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్(Lotus Pond) వద్ద ఆటో డ్రైవర్(Auto driver) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోను రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని టోలిచౌకికి చెందిన షాదిఫ్(28)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి(Osmania Hospital) తరలించారు. అనంతరం ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.