ధరల పెంపుపై భగ్గుమన్న ఆటో డ్రైవర్లు
జవహర్‌నగర్ గోగ్యాస్ వద్ద భారీ ఆందోళన
జవహర్‌నగర్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : పెరిగిన ఆటో గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు సమరశంఖం పూరించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ఫైరింగ్ రేంజ్ దగ్గర గోగ్యాస్ (గో గ్యాస్) ఫిల్లింగ్ స్టేషన్ వద్ద శనివారం ఐక్యంమతం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో రూ. 57 గా ఉన్న గ్యాస్ ధరను ఏకంగా రూ. 125కు పెంచడాన్ని నిరసిస్తూ ఐకమత్యం ఆటో యూనియన్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ధరల పెంపుతో బతుకు భారమైందని, తెలిపారు.
ఐక్యంమతం ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టా కృపవరం మాట్లాడుతూ ఒక్కసారిగా గ్యాస్ ధరను డబుల్ కంటే ఎక్కువగా పెంచడం వల్ల ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు యూనియన్ జనరల్ సెక్రటరీ కూరాకుల నర్సింగ్ రావు నేతృత్వంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది ఆటో డ్రైవర్లు తరలివచ్చి గోగ్యాస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్య క్రమంలో కట్టా కృపవరం (రాష్ట్ర అధ్యక్షుడు, ఐక్యంమతం ఆటో యూ నియన్)కూరాకుల నర్సింగ్ రావు (జనరల్ సెక్రటరీ)కనపూర్ మారుతి (యూనియన్ ప్రతినిధి)రాపోలు శంకర్ (యూనియన్ ప్రతినిధి)ఎస్. బాలరాజ్ (జేఎంసి, జీహెచ్‌ఎంసి ఉపాధ్యక్షుడు) నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆటో కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొని తమ సంఘీ భావాన్ని ప్రకటించారు. పెరిగిన ధరల వల్ల రోజువారీ ఆదాయం అంతా గ్యాస్కే సరిపోతుందని, కుటుంబ పోషణ భారంగా మారిందని డ్రైవర్లు ఈ సందర్భంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.




