హైదరాబాద్‌లో ర్యాగింగ్ షాక్.. జూనియర్లపై దాడి, 12 మందిపై కేసు
12 మందిపై కేసు
- బీడీఎస్ జూనియర్ విద్యార్థులను వేధించిన సీనియర్లు
- వారిపై 6 నెలలపాటు వేటు
ప్రశ్న: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏమి జరిగింది?
జవాబు: జూనియర్ బీడీఎస్ విద్యార్థులను వేధించినందుకు 12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేసి, 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ కోఠిలోని ఉస్మా నియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వేధించిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి, కాలేజీ యాజమాన్యం 6 నెలలపాటు సస్పెండ్ చేసింది. కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ డెంట ల్ సర్జరీ (బీడీఎస్) మొదటిసంవత్సరం చదువుతున్న విద్యార్థులను బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 12 మంది విద్యార్థులు ర్యాగింగ్ చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే…
ఈ విషయం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్‌కు తెలిసింది. ఆయన ఫిర్యాదుతో ఆ 12 మంది విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద సుల్తాన్ బజార్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ 12 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్ చూడండి
విద్యార్థులపై ఇలా వేధింపులు జరగడం పై మీ అభిప్రాయం ఏమిటి?
విద్యార్థులను ఎలా వేధించారంటే..
ర్యాగింగ్ గురించి ప్రిన్సిపాల్ పలు విషయాలు వెల్లడించారు. గత ఆరు నెలలుగా బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని, దీనిపై ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి తనకు లిఖితపూర్వక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. హాస్టల్‌లో ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్‌ను ఆపడానికి వెళ్లిన ఇంటర్న్‌స్ (హౌస్ సర్జన్స్)పై కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులు దాడికి తెగబడ్డారని, ఒక ఇంటర్న్ కంటిపై కూడా కొట్టారని చెప్పారు.
ఇలాంటి మరో ఘటన గురించి చదవండి: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
ఈ గొడవ జరిగిన తర్వాత తాము ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు జూనియర్లతో వాటర్ తెప్పించుకోవడం, స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ తెప్పించుకోవడం, కూలర్లలో నీళ్లు నింపమనడం వంటి పనులు చేయించుకునేవారని తెలిపారు.
సమయంతో సంబంధం లేకుండా రాత్రి వేళల్లో పిలిపించి.. చెప్పిన పనులు చేయకపోతే సిటప్స్ (కూర్చోబెట్టి లేపడం) చేయించడం, చైర్ లేకుండా కూర్చోబెట్టడం (గాల్లో కూర్చోబెట్టడం) వంటి వేధింపులకు గురిచేశారని వివరించారు. ఇలా జూనియర్ విద్యార్థులపై సీనియర్లు గత ౬ నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తనకు ఫిర్యాదు చేస్తే మందలించానని అయినా సీనియర్ విద్యార్థులలో మార్పు రాలేదన్నారు. కాలేజీలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రిన్సిపల్ సజ్జీవ్ సింగ్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలపై తాజా అప్‌డేట్స్ కోసం మా వెంట ఉండండి.
FAQ's
1. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఎలా జరిగింది?
సీనియర్ బీడీఎస్ విద్యార్థులు జూనియర్లను రాత్రి వేళల్లో పిలిపించి పనులు చేయించడం, శారీరకంగా వేధించడం జరిగింది.
2. ఎన్ని మంది విద్యార్థులపై కేసు నమోదైంది?
మొత్తం 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
3. కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంది?
ఆ 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.
4. ర్యాగింగ్ సమయంలో ఏమేమి చేయించేవారు?
వాటర్ తెప్పించడం, ఫుడ్ ఆర్డర్స్ తెప్పించడం, సిటప్స్ చేయించడం వంటి వేధింపులు జరిగాయి.
5. ఈ ఘటన ఎక్కడ జరిగింది?
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌లో జరిగింది.
6. పోలీసులు ఏమి చేస్తున్నారు?
తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.






