రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన ఏవీఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థిని మోక్షిత

12-09-2026 | 04:58pm

మహబూబ్ నగర్ జిల్లా

గండీడ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఏవీఆర్ గ్లోబల్ స్కూల్(AVR Global School) విద్యార్థిని మోక్షిత రాష్ట్రస్థాయి యోగా క్రీడా పోటీల(state-level yoga competitions)కు ఎంపికై ప్రతిభ కనబరిచింది. ప్రస్తుతం జాతీయస్థాయి యోగా క్రీడల కోసం కరీంనగర్‌లో జరుగుతున్న పోటీల్లో ఆమె పాల్గొంటోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని పాఠశాల ప్రిన్సిపల్ అంజయ్య గౌడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వెంకట్రాములు, రమేష్, వెంకటస్వామి, అనిల్ కుమార్‌, పసుపుల జ్యోతి తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని మోక్షితను అభినందించారు. విద్యార్థిని ఈ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన యోగా ఉపాధ్యాయురాలు బాలమణిని,మోక్షిత తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

మరిన్ని వార్తలు