13 July, 2026 | 1:41 PM

అసమాన్యమైన సేవలకు పురస్కారాలు

28-12-2024 02:41 AM

ఆర్థిక సంస్కరణల విషయంలో మన్మోహన్ సింగ్ చేసిన అపారమైన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను 1987లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థికాభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1995లో జవహర్‌లాల్ నెహ్రూ బర్త్ సెంచరీ అవార్డును ప్రదానం చేసింది.

భారతదేశ ఆర్థిఖ సరళీకరణలను ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ సింగ్ చేసిన సేవకుగాను 1993,1994ల్లో వరుసగా రెండు సార్లు ఆసియా మనీ అవార్డు లభించింది. ఇండియన్ ఎకానమీ, రాజకీయాల్లో ఆయన చూపిన అంకితభావానికి 1993లో యూరో మనీ అవార్డు లభించింది.

ఎకనమిక్ థియరీ అండ్ స్టడీలో మన్మోమన్ సింగ్ అందించిన సహకారానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయనను 1956లో ఆడమ్ స్మిత్ ప్రైజ్ అవార్డుతో సత్కరించింది. కేంబ్రిడ్జ్‌కు చెందిన సెయింట్ జాన్స్ కాలేజీ ‘రైట్ ప్రైజ్’తో మన్మోహన్ సింగ్‌ను గౌరవించింది.