13 July, 2026 | 1:11 PM

అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ.. BJP, BRS ఎంపీల హాజరుపై ఉత్కంఠ

13-07-2026 12:16 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల ఎంపీలతో(Telangana MPs) సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ మీటింగ్ కోసం ప్రజాభవన్ లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. BJP, AIMIM లోక్ సభ సభ్యులు, BRS(Bharat Rashtra Samithi) రాజ్యసభ సభ్యులకూ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం(Central Government) వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర ప్రాజెక్టులు(Central Projects), నిధుల సాధనకు ఎంపీల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. పార్లమెంట్  సమావేశాల్లో(Parliament sessions) లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కీలక భేటీకి బీజేజీ, బీఆర్ఎస్ ఎంపీల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ వ్యూహం, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చల అనంతరం వాటిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.