అవార్డులు బాధ్యతను పెంచుతాయి
టెలి, సినిదర్శక, నిర్మాత సురేష్‌కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు, రచయిత దండనాయకుల సురేష్ కుమార్ అన్నారు.గురువారం ఆసిఫాబాద్ కవుల సంఘం (ఆకసం) ఆధ్వర్యంలో నిర్వహించిన 102వ నెలపొడుపు కవి సమ్మేళన కార్యక్రమం ఆయన స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ధర్మపురి పుణ్యక్షేత్రంలోని శేషప్ప కళావేదికలో అష్టావధానం నిర్వహించి ప్రశంసలు పొందిన ప్రముఖ అష్టావధాని మాడుగుల నారాయణ మూర్తిని, తెలుగు వెలుగు సాహితీ వేదిక వారి మహానంది పురస్కారం పొందిన చిలుకూరి రాధాకృష్ణ చారిని, శ్రీశ్రీ కళావేదిక జాతీయ పురస్కారం పొందిన దర్ని శ్రీలతను ఆకసం, నవజ్యోతి సభ్యులు శాలువాలు, పూలమాలల తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం లో ఆకసం అధ్యక్షుడు నల్లగొండ రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షుడు మాడుగుల నారాయణ మూర్తి, గుర్రాల వెంకటేశ్వర్లు, ధర్మపురి వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, డి. రామారావు, మాడిశెట్టి శ్రీనివాస్, ఇషాక్, ఢిల్లీ విజయ్ కుమార్, పెంటయ్య, శ్రీలత, మురళి తదితరులు పాల్గొన్నారు.






