06-02-2026 01:46:43 AM
అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం
ములుగు,ఫిబ్రవరి5(విజయక్రాంతి):ములుగు మండలం అంకన్నగూడెం గ్రామంలో బాలకుమారస్వామి జాతర సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ఆలయ మరమ్మతుల పనులకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు 5 లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాలకుమారస్వామి జాతరకు రావడం సంతోషంగా ఉందని గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు,సన్న బియ్యం,సీసీ రోడ్లు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బాలకుమారస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆయా ప్రాంతాల గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు గ్రామస్థులు,మహిళలలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు