12 June, 2026 | 1:23 AM

‘సర్’పై బీఎల్‌ఏలకు అవగాహన

12-06-2026 12:13 AM

మేడ్చల్, జూన్ 11 (విజయక్రాంతి): సర్ పై మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ బిఎల్‌ఏలకు గురువారం అంతాయిపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా బిఎల్ ఏలు చూడాలన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా కుట్రలు జరుగుతున్నాయని, దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని 602 పోలింగ్ బూత్ లకు సంబంధించిన బిఎల్‌ఎలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి, డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ అధ్యక్షత వహించగా, డిసిసి మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు గజ్జలకాంత్, సమీర్, టి పి సి సి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ఆర్టిఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్, అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు అజయ్ యాదవ్, శాంతి కోటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.