16 April, 2026 | 2:01 AM

ట్రాఫిక్ నియమాలపై యువతకు అవగాహన

16-04-2026 12:28 AM

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించి, యు వతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంచేందుకు సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం కొత్తగూడ లోని కెఎల్హెచ్ యూనివర్సిటీలో ట్రాఫిక్ అధికారులతో కలిసి విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి డాక్టర్ ఎం.రమేష్ విద్యార్థులతో మాట్లాడుతూ... రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి యాత్రికుడు జీవితాన్ని కాపాడు కోవాలి.

రోడ్డు ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టం కాదు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు.తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు ఎదురైన రోడ్డు ప్రమాదాల అనుభవాలను పంచుకోవాలని, కోరారు.ఈ చర్చల ద్వారా విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు శాఖ అర్రైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత,హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ వంటి అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులు రోడ్డు భద్రతపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శేరిలింగంపల్లి,అడిషనల్ డీసీపీ ట్రాఫిక్, ఏసీపీ మాధాపూర్ ఇతర ట్రాఫిక్ శాఖ అధికారులు పాల్గొన్నారు.