చైల్ సేఫ్టీ, యాంటీ డ్రగ్‌పై అవగాహన
వెంకటాపూర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో చైల్ సేఫ్టీ మరియు యాంటీ డ్రగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటాపూర్ పోలీసు సిబ్బంది, ములుగు జిల్లా భరోసా సెంటర్ అధికారులు, చైల్ ప్రొటెక్షన్ విభాగం సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు బాల్య వివాహాల నివారణ, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను, అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను అధికారులు వివరించారు. సమాజంలో చైల్ సేఫ్టీకి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.






