26 May, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

26-05-2026 03:49 PM

 పడిపూజ, అభిషేకం 

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.

సుల్తానాబాద్, మే 26 (విజయక్రాంతి): ఉత్తర నక్షత్రం అయ్యప్ప స్వామి  పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మంగళవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం లో  వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా జరిపారు, ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అభిషేకం, పడిపూజ, హోమాలు పూజారులు గూడ రమేష్ శర్మ, సాయినాథ్ శర్మలు ఘనంగా నిర్వహించారు.

ఆలయ నిర్వాహకులు మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ సర్పంచ్ సాయిరీ పద్మ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు , పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు... ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధి కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), డీలర్ మెరుగు వెంకటేష్ ,  పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్,  తుమ్మ రాములు, గుండ మురళి పలువురు పాల్గొన్నారు...