26 May, 2026 | 4:19 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నండి: మండల వ్యవసాయ అధికారి

26-05-2026 03:47 PM

దమ్మపేట, మే 26(విజయక్రాంతి): ఈ సంవత్సరం యాసంగి 2026 నందు దమ్మపేట మండలంలో 9 వేల ఎకరాల్లో వరి సాగు, మొక్కజొన్న పంట సుమారు ఐదువేల ఎకరాల్లో సాగు చేశారని,  ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంట హార్వెస్టింగ్ పూర్తి కావచ్చిందని, పంట తీసుకున్న తర్వాత పంట అవశేషాలు అనగా వరి పంటలో వరి కయ్యలు, అదేవిధంగా మొక్కజొన్న పంటలో మొక్కజొన్న దంటు ఆకు అలాగే పొలాల్లో వదిలేస్తామనీ దీనివల్ల ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండటం వలన, విద్యుత్తు తీగల రాపిడి వలన గాని, మరే విధంగానైనా నిప్పురవ్వలు తగిలితే పంట పొలాల్లో ఉన్నటువంటి వ్యర్ధాలు పూర్తిగా తగలబడటం జరుగుతుందనీ, దీనివల్ల మనం భూసారాన్ని కోల్పోవడమే కాక పర్యావరణ కాలుష్యానికి కూడా కారకులమవుతామని, అంతేకాకుండా పామాయిల్ పంటలో అంతర పంటగా మొక్కజొన్న పంట సాగు చేసి అలా వదిలివేయడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే  నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని,  కాబట్టి రైతులు తప్పనిసరిగా పంట పూర్తి అవ్వగానే వ్యర్ధాలను భూమిలో రోటవేటర్ తో భూమిలో కలియదున్నాలని తద్వారా భూ సారం కూడా పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.