బా‘బోయ్ భీమన్న’ అవార్డు
ఆచార్య మసన చెన్నప్ప :
స్వామి సత్యానంద సహజయోగంలో సిద్ధహస్తుడు. సన్యాస జీవితాన్ని గడుపుతూనే శిష్యులకు సహజ ధ్యానంలోని మెలకువలను బోధించడం నాకు చాలా నచ్చింది. అందుకే నేను నెలకో, రెండు నెలలకో ఒకసారి కరీంనగర్ జిల్లా ఎలబాకలో ఉన్న వారి ప్రణవాశ్రమానికి వెళ్తుంటాను. ఈసారి నాల్గు రోజు లున్నాను. మరో రెండు రోజులుండాలని సత్యానంద స్వయంగా కోరినారు. కాని నేను వారి కోరికను కాదని 11--04--2025 నాడు హైదరాబాదుకు వచ్చాను.
అలా రావడానికి కారణం మర్నాడు అవార్డు ఫంక్షన్ ఒకటి ఉండడమే. అవార్డులెవరైనా ఇస్తున్నారంటే ఎంతవారికైనా మన స్సు సంతోషంతో నిండిపోతుంది. నేను మనిషినే కదా! నాకు మనస్సు ఉంది కదా! అందుకే ఇంత వయస్సు వచ్చినా ఎవ్వరు అవార్డును ప్రకటించినా కాదనలేను. ఎక్కడున్నా ఆ వేదిక, ఆ చోటికి రాకుండా ఉం డను ఎన్ని ఇబ్బందులెదురైనా. ఏప్రిల్ 12 హనుమజ్జయంతి. ఆరోజు సిటీ అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. కాని ఆరోజే అవార్డు ఫంక్షన్ ఏర్పాటైంది.
పాతపట్నం నుంచి చిక్కడిపల్లి మీదుగా జూలూస్ వె ళ్తుంది. ఐనా నిర్వాహకులిదేమీ పట్టించుకోలేదు. నేను తీసుకుంటున్న అవార్డు మా మూలు అవార్డు కాదు. ‘మహాకవి పద్మభూషణ్ బోయి భీమన్న’ పేరు మీద ఉన్న ది. వంశీరామరాజు ఉగాది సందర్భంగా ఒక 60 మందికి పురస్కారాల కార్యక్రమం తలపెట్టినాడు త్యాగరాయగానసభలో. వంశీరామరాజు ముందుగానే నాకు ఫోను చేసి అవార్డు ప్రదాన దినోత్సవం నాడు మధ్యాహ్నం 2 గంటలకే రావాలన్నాడు. సంగీత విభావరి సమయానికి ఆరంభమవుతుందని తెలియజేశాడు.
ప్రయాణంలో తిప్పలు
నేను ఉదయం నుంచే తయారయ్యా ను. పది గంటల సమయంలో రామరాజుగారు సాయంత్రం 5 గంటలకు వస్తే సరిపోతుందని చెప్పారు. నేను నా సొంత పనులు చూసుకోవడంలో నిమగ్నమై టైం కు పోదాంలే అనుకున్నాను. కానీ భీమన్న గారి సతీమణి హైమావతిగారు స్వయంగా ఫోన్ చేసి ‘సాయంత్రం 3 గంటలకు వస్తే మీకు అవార్డు ప్రదానం జరుగుతుం’దని తెలియజేశారు. ఔను! అవార్డు గ్రహీతలు అంత మంది ఉన్నారు కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం సూచించారేమో అనుకున్నాను.
ఐనా వారు చెప్పినట్లు మధ్యా హ్నం భోంచేసి ఎండలో కార్లో రెండు గం టలకు ఇంటి నుంచి బయల్దేరాను. నేరుగా సుందరయ్య విజ్ఞానకేంద్రం దాకా వెళ్లినవాణ్ణి ఆగిపోయాను. రోడ్డుమీద పోలీసు లు గూమికూడి ఉన్నారు. ‘బారికేడ్స్’ పెట్టి కాపలా కాస్తున్నారు. చిక్కడిపల్లి వైపుకు ఎవరూ పోకుండా అలా చేశారనిపించిం ది. ఎలాగో అంబేడ్కర్ కాలేజీ దాకా వ చ్చాను కానీ అక్కడ కూడా రోడ్డు మూసేశారు. అప్పటికి టైం 2.25 గంటలు. ఏం చేయాలో అర్థం కాలేదు.
సందులగుండా ప్రయాణిస్తే చిక్కడిపల్లి రోడ్డు సమీపానికి వచ్చాను. కానీ రోడ్డు మీద జులూస్ సాగుతుంది. తిరిగి వెనక్కి వెళ్లడం తప్ప నేనిం కేమీ చేయలేని పరిస్థితి. అతికష్టం మీద కారు తిప్పుకొని వెనక్కి ఆర్టీసీ కళ్యాణమండపం దాకా వచ్చాను. అక్కడ కారు పెట్టి కాలినడకన త్యాగరాయగానసభకు పోదామన్నా దూరమవుతుంది. అందుకే కారు ను పూర్తిగా రాంనగర్ వైపుకు తిప్పి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిని అధిరోహించాను.
నేరుగా 60 కి.మీ. వేగంతో రామకృష్ణమఠం చేరుకున్నాను. అక్కడి నుంచి చిక్కడ పల్లికి రావాలనుకున్న నేను హిమాయత్‌నగర్ దాకా రాగలిగాను. కానీ అక్కడ పోలీ సులు మోహరించి ఉన్నారు. ఎవరినీ రానివ్వడం లేదు. హిమాయత్‌నగర్ నుంచి గాంధీనగర్ వెళ్లే మార్గంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఆ దారి నాకు తెలుసుకనుక ఎలాగో అక్కడికి చేరుకొన్నాను.
సరాసరి స్టేజీ మీదకు
నిజం చెప్పాలంటే నా ప్రయాణం చం ద్రుని మీది దక్షిణ ధ్రువంలో ఉపగ్రహాన్ని ఆపడం లాంటిది. అప్పటికీ 3 గం టలవుతుంది. కారు పార్క్ చేసి త్యాగరాయగాన సభ ప్రధానద్వారం చేరుకొన్నాను. అక్కడనే వంశీరామరాజు గారు, హైమావతి గారు దర్శనమిచ్చారు. ‘రండి చెన్నప్పగారు. మీరు అవార్డు తీసుకోవచ్చు’ అని నన్ను సరాసరి స్టేజీ మీదికి తీసుకొని వెళ్లారు. సభా వేదిక మీద ఎవరో గాయకు లు పాటలు పాడుతున్నారు.
సభలో ప్రేక్షకులు ఎక్కువగా లేరు. నన్ను గర్తుపట్టే వా రిని, నేను గుర్తుపట్టే స్థితిలో లేను. ఒకటే హడావుడి కదా! అసలు త్యాగరాయగానసభకు చేరుకుంటానా లేదా? అన్న సందే హం నాది. కానీ ఎలాగో చేరగలిగాను. పాట ఐపోగానే రామరాజుగారు, హైమవతి గారు స్వయంగా నాకు ‘పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న వంశీ ఉగాది పురస్కారం- బహుకరించారు.
వచ్చిన పని ఐపోయింది కనుక ఇంక సభలో కూర్చోవలసిన అవసరం లేదనిపించి, అ వార్డు ఫలకంతో బయటికి నడిచాను. బ యటికి నడవగానే మా పెద్దన్నయ్య కుమారుడు డాక్టర్ రామనాథం, నా బాల్య స్నే హితుడు కె. రామచంద్రారెడ్డి, ‘గీతా జ్ఞానసేవా ట్రస్టు’ వ్యవస్థాపకుడు వి. సత్యనా రాణ గారు కనిపించారు. నేను అవార్డు తీ సుకుంటున్నప్పుడు లోపల ఉండి చూడాలనుకున్నవారు ఎంతో నిరాశపడ్డారు.
అవార్డంటే చెక్కపలకా?
నేను మెమెంటోను నా కార్లో పెట్టవలసిందిగా రామనాధాన్ని కోరాను. కాని వా డు మెమెంటోను చేతిలోకి తీసుకొని ‘ ఈ చెక్కపలక కోసమే ఇంత కష్టపడి వచ్చా వా? బాబాయ్ అని ప్రశ్నించడంతో అ యోమయంలో పడ్డాను. ‘నేను మనఃస్ఫూర్తిగా తీసుకున్నది మహాకవి బోయి భీమ న్న పురస్కారం. ఇది వట్టి చెక్కపలక కాదు. భీమన్నగారి సాహితీమూర్తి మత్వాన్ని ప్రతిబింబించే ప్రతిభాదర్పణం. నాకు వారితో ఎంతో అనుబంధం ఉంది.
లేకపోతే ఈ అవార్డు నాకెందుకిస్తారు?’ అని సమాధానం ఇచ్చేశాను. మా రామనాథం చప్పు డు చేయకుండా మౌనంగా ఉండి పోయా డు. కానీ మా మిత్రుడు సత్యనారాయణ ‘మీకు ఏమైనా క్యాష్ ఇచ్చారా’ అని అడిగాడు. ఏమీ ఇవ్వలేదన్నాను. అతడేదో ఆశ పడి పోగొట్టుకొన్నవాడిలా ముఖం పెట్టా డు. ఇదేమిటి? వీళ్ల దృష్టిలో అవార్డు చెక్కముక్కతో సమానమా? క్యాష్ ఇస్తేనే అవా ర్డు ఇచ్చినట్లా? నాకేమీ అర్థం కాలేదు. అవార్డుల రూపంలో క్యాష్ ఇస్తారా? నేను కార్లో బయల్దేరి ఇంటికి వచ్చిన తర్వాత, నా అవార్డు సంగతి ఎవరికీ చెప్పలేదు.
నిజానికి అవార్డు కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనువారు ఆచార్య నిత్యానంద రావు, ఆచార్య సూర్యాధనంజయగార్లు. ఇ ద్దరూ వీసీలే. వారి చేతుల మీదుగా అవా ర్డు తీసుకోలేదని నేను చింతపడుతుంటే అవార్డంటే చెక్క పలక అని, కాదు క్యాష్ అని, పురస్కారం అంటే వట్టి సన్మానం కా దు అని పలువురు మాట్లాడడం కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏది ఎవరికి ఎంత ప్రాప్తమో వారికంతే ప్రాప్తి! నాకు మాత్రం మహాకవి బోయి భీమన్న గారి పేరు మీద పురస్కారం లభించినందుకు ఎంతో సంతోషం కలిగింది.






