22 April, 2026 | 10:40 AM

కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

22-04-2026 09:36 AM

కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులను బస్టాండ్లలో నిలిపివేశారు. పోలీస్ ల సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోల నుంచి తీసి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికుల అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. కామారెడ్డి బస్టాండ్ తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిలిచిపోయాయి.

ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై తంటాలు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ఇబ్బందుల మధ్య పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం బస్టాండ్లలో తిష్ట వేసి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు వేచి చూసి బస్సులు నడవయని గుర్తించి ప్రైవేట్ వాహనాలపై వెళుతున్నారు.