కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు
22-04-2026 10:26 AM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె(Telangana RTC Strike) కొనసాగుతోంది. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్(Kamareddy Bus Stand) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య అద్దె బస్సు నడిపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. బస్సును అడ్డుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు(RTC JAC Leaders) గాలి తీసేశారు. ప్రైవేట్ డ్రైవర్ సాయి రెడ్డిపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బస్టాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ సమ్మె వల్ల బస్సులు బాన్సువాడ డిపోలో(Banswada Bus Depot) ఆగిపోయాయి. బస్సులు బంద్ కావడంతో పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ వాహన దారులు ప్రయాణికుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.






