13 April, 2026 | 6:12 PM

24వ వార్డులో ఘనంగా సీమంతం, అక్షరాభ్యాసం

13-04-2026 05:07 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ 24వ వార్డు అంగన్వాడి కేంద్రంలో సీమంతం, అక్షరాభ్యాస కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ చెనిగరపు శృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్యం, శిశు సంక్షేమం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని తెలిపారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది చైర్ పర్సన్, కౌన్సిలర్‌ను సన్మానించారు.