రోడ్డుపై మురికి నీరు.. సార్లు మీరైనా పట్టించుకోరు!
బోథ్, జులై 27 (విజయక్రాంతి): మండల కేంద్రం లోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు పై నుండి మురికి నీరు ప్రవహిస్తున్నది. దీంతో పాదాచార్లకు ద్విచక్ర వాహనాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గ్రామపంచాయతీ వారు ఆర్ అండ్ బి రోడ్డును మరోవైపు నుండి ప్రవహిస్తున్న మురికి కాలువలోకి నివాసగృహాల వారు వాడిన మురికి నీటిని కలపాలని నిర్ణయించారు.దీంతో రోడ్డుకు కుడివైపున ఉన్నవారు ఈ విషయమై ఎంపీడీవో రమేష్ కు సోమవారం విన్నవించారు. స్పందించిన ఎంపీడీవో గ్రామపంచాయతీ ఈవో అశోక్ కుమార్ ను పిలిపించి రోడ్డు దాటించకుండా ఎవరి ఇంటి నుండి నీరు ప్రవహిస్తుందో ఆ ఇంటి ముందే మురికి కాలువ నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డుపై మురికి నీరు ప్రవహించడం వల్ల ఆర్ అండ్ బి రోడ్డు సైతం చెడిపోయింది .జిల్లా అధికారులు ఈ విషయంలో ఉత్తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.






