17 April, 2026 | 11:54 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బాన్సువాడలో బంద్ ప్రశాంతం

23-02-2026 01:02 AM

బాన్సువాడ, ఫిబ్రవరి 2౨ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మాట్ షో రూమ్ లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా రాస్తారోకో చేపట్టారు. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి ఆందోళనలో విరమింప చేశారు.

దీంతో శనివారం హిందూ సంఘాలు బిజెపి ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ముగ్గురు డిఎస్పీలు 20 మంది సిఐలు 30 మంది ఎస్‌ఐలు 200 మంది పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి పట్టణ సీఐ తూల శ్రీధర్ రూరల్ సిఐ తిరుపతయ్యలు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు.