13 March, 2026 | 1:40 PM

రేపు అంజన్న ఆశీర్వాద యాత్ర

13-03-2026 12:00 AM

వేలాది మందితో కలిసి బండి సంజయ్ మహా పాదయాత్ర

ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి పాదయాత్రకు శ్రీకారం

ఉదయం నుండి సాయంత్రంలోపు 40 కి.మీలు పాదయాత్ర చేయనున్న కేంద్ర మంత్రి

సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి

నూతన ప్రజాప్రతినిధులతో కలిసి అంజన్నకు మొక్కులు తీర్చుకోనున్న బండి సంజయ్

దాదాపు 10 వేల మంది కార్యకర్తలు మహాపాదయాత్రలో పాల్గొనేలా కార్యాచరణ

కరీంనగర్, మార్చి12(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” పేరిట ఈనెల 14న మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఈ మహా పాదయాత్ర చేయబోతున్నారు.

కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే తన పార్లమెంట్ పరిధిలోని నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడక వచ్చి మొక్కులు తీర్చుకుంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రకటించిన విషయం తెలిసిందే... ప్రజలంతా బీజేపీని ఆశీర్వదించి మేయర్ పీఠాన్ని అప్పగించడంతోపాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే అత్యధికంగా పంచాయతీ వార్డు స భ్యులు, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థా నాలను గెలుచుకోవడంతో  ఇచ్చిన మాట ప్రకారం మొక్కులు తీర్చుకునేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. అందులో భాగం గా ఈ మహా పాదయాత్రకు “అంజన్న ఆశీర్వాద యాత్ర”అని నామకరణం చేశారు.

ఈనెల 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు అవసర మైన ఏర్పాట్ల కోసం డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంఛార్జ్ లు భండారి శాంతికుమార్, మోహన్ రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ లు సమావేశమై  పాదయాత్ర ఏర్పాట్ల కోసం కోసం  ప్రత్యేకంగా కమిటీని నియమించారు.

కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు సైతం మహాపాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు   కరీం నగర్ కార్పొరేటర్ లతో సమబేషమై దిశ నిర్దేశనం చేశారు.మరోవైపు ఈ మహాపాదయాత్రలో బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగులు వేసేందుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలంతా సిద్ధమయ్యారు. ఈ మేరకు కరీం నగర్ ఎంపీ కార్యాలయానికి ఫోన్లు చేసి తాము పాదయాత్రకు వస్తామని పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల మొదలు, మండల, జిల్లా, పార్లమెంట్ స్థాయి నాయకులంతా ఈ మహాపాదయాత్రలో పాల్గొంటారు.

రాజకీయాలకు అతీ తంగా నిర్వహించే పూర్తి ఆధ్యాత్మిక భావనతో ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.14న ఉదయం 7 గంటలకు కరీంనగ ర్ మహాశక్తి ఆలయం నుండి ఈ మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. రేకుర్తి, కొత్తప ల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మ ల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.

మరోవైపు నూతన ప్రజాప్రతినిధులతో కలిసి బండి సంజయ్ పాదయాత్రకు వస్తుండటంతో... ఆయా గ్రామాల్లోని, కాషాయ కార్యకర్తలు, హిందుత్వ వాదుల్లో జోష్ నెలకొంది. సంజయ్ పాదయాత్రకు మంగళ హారతు లు, పూలతో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో దారిపొడవునా పాదయాత్ర చేసే కార్యకర్తలు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు అవసరమైన మేరకు పులిహోర ప్యాకెట్లను కూడా సిద్ధం చేయనున్నారు. ఈ పాదయాత్రలో పలు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు సైతం ఈ పాదయాత్రలో పాల్గొనే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యాయి.