30 March, 2026 | 12:47 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

211 పరుగుల ఆధిక్యంలో బంగ్లా

04-12-2024 12:12 AM

విండీస్‌తో రెండో టెస్టు

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జాకర్ అలీ (29*), తైజుల్ ఇస్లామ్ (9*) క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ 211 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. కీసీ కార్టీ (40), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (39) మినహా మిగతావారు విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రానా ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరవగా.. హసన్ మహ్ముద్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ అయింది.