18 August, 2026 | 12:15 PM

Breaking News

కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •   పట్వారిగూడెంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే   •  

ర్యాంకింగ్స్ ఆధారంగానే..

21-06-2024 02:20 AM

ఒలింపిక్స్‌కు భారత ఆర్చర్ల రికర్వ్ బృందం

అంటల్యా (టర్కీ): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల, మహిళల ఆర్చరీ రిక్వర్వ్ జట్లు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. అయితే ర్యాంకింగ్స్ ఆధారం గా భారత రికర్వ్ జట్లు ఒలింపిక్స్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. సోమవారం వరల్డ్ ఆర్చరీ అధికారికంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించనుంది. టర్కీ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ భారత ఆర్చర్ల రికర్వ్ బృందం పతకం గెలవడంలో విఫలమైంది. మహిళల రికర్వ్ విభాగంలో భజన్ కౌర్, దీపికా కుమారి, అంకితతో కూడిన జట్టుసెమీస్‌లో వెనుదిరిగింది. ఇక పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్ బృం దం ప్రిక్వార్టర్స్‌కే పరిమితమైంది. రికర్వ్ విభాగంలో భారత పురుషుల జట్టు 2వ ర్యాంక్‌లో.. మహిళల జట్టు 8వ ర్యాంక్‌లో ఉన్నాయి.