28 February, 2026 | 7:13 AM

సమస్యల పరిష్కారానికే బస్తీబాట

28-02-2026 12:41 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్, ఫిబ్రవరి27 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికే బస్తీబాట చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ డివిజన్లలో కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించి, ప్రజా సమస్యలు తెలు సుకున్నారు. అనంతరం శ్రీలత మినీ ఫంక్షన్ హాల్‌లో  బీజేపీ జిల్లా  అధ్యక్షుడు భరత్ గౌ డ్, బండ కార్తీక్‌రెడ్డి, మేకల సారంగపాణి, కే నాగేశ్వర్ రెడ్డి, కంకటాల హరితో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీని 300 డివిజన్లుగా విభజించి, ఒక్క కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా చేయడం వెనుక బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలనే అక్కసే కారణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  ఆరోపించారు. హైదరాబాద్ కోర్ సిటీని మజ్లిస్ పార్టీ కి అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభు త్వం ఈ ప్రయత్నం  చేస్తోందని విమర్శించారు.  హైదరాబాద్‌కు తగినంత నీటిని తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

తెల్లకాగితంపై మెట్రో ఎవరూ ఇవ్వరు

‘ఎల్ అండ్ టీని టేకోవర్ చేసి, పాత మెట్రో కొత్త మెట్రో కలిపి డీపీఆర్ తయారు చేయాలి. డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు కేంద్రానికి పంపాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. అప్పుడు మేము దానిపై చర్చించి ఏరకంగా ఉందో ఆలోచించి..  క్యాబినెట్ అప్రూవల్ ఇస్తుంది. డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేనప్పుడు.. తెల్లకాగితంపై మెట్రో ఎవరూ ఇవ్వరు కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో 60 ఏళ్లుగా ఉంటున్న వారిని నిరాశ్రయులు చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. అనంతరం అడ్డగుట్ట, తార్నాక డివిజన్‌లలో కూడా కిషన్ రెడ్డి పర్యటించారు. అడ్డగుట్ట డివిజన్ కళావతి కాలనీలో కమ్యూనిటీ హల్‌కు శంకుస్థాపన చేసారు. తార్నాకలో కాలనీల అధ్యక్షులు, పలు సంఘాల నేతలతో సమావేశామయ్యారు.