28 February, 2026 | 9:16 AM

ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ

28-02-2026 12:40 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ.4,30,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మరియు ఎల్‌ఓసి పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని,వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కేవలం కాగితం కాదు, అది ఒక నిరుపేద కుటుంబానికి దొరికిన భరోసా అన్నారు. లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు మరియు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.