5 May, 2026 | 1:52 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

‘కులగణన’పై బీసీ కమిషన్ సంప్రదింపులు

14-09-2024 02:02 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు శుక్రవారం పూర్వ కమిషన్ సభ్యులతో కులగణనపై సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా తాము గతంలో సేకరించిన సమాచారం వివరాలను పూర్వ కమిషన్ సభ్యులు వెల్లడించారు. జి.నిరంజన్ నేతృత్వంలోని కమిషన్‌కు విధాల సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. అలాగే తరుచుగా సమావేశమై పరస్పర చర్చలు జరుపుకోవాలని ఇరువురు నిర్ణయించారు. సమావేశంలో ప్రస్తుత కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాలలక్ష్మి, పూర్వ బీసీ కమిషన్ చైైర్మన్ బి.ఎస్.రాములు, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, డాక్టర్ ఆంజనేయ గౌడ్ , జూలూరి గౌరీ శంకర్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే.కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.