08-12-2025 01:02:26 AM
-మహిళలకు ప్రాధాన్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకతలేదు..
-తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, డిసెంబర్ 7(విజయక్రాంతి): బీసీ మహిళలకు రాజ్యా ధికారం దక్కాలంటే పార్లమెంట్‌లో పాసైన మహిళ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని తెలం గాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వ హించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మహిళా సంఘాల కోర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు.
మహిళ బిల్లులో బీసీ మహిళలకు ప్రాతిని ధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో లోక్ సభలో కూడా ఆమోదం పొం దింది. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేద ని ప్రశ్నించారు.
బీసీలంటే చిన్న చూపా? బీసీ సబ్ కోటా గురించి అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని మండిపడ్డారు. ర్యాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ స్త్రీలపై అత్యాచారాలు, హత్యలకు సినిమా రంగం కూడా తోడవుతుందని అన్నారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో అసభ్యకర దృ శ్యాలు పూర్తిగా నిషేధించాలని కోరారు.
ఈ సందర్భంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా గంగాపురం పద్మను నియమించారు. అనంతరం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు గవ్వల భరత్, జాతీయ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధగౌడ్, దివ్య, దీపా, పద్మ, వసంతమ్మ, జ్యోతి, అపర్ణ, రాజకుమారి, లక్ష్మి సౌజన్య, ప్రియాం క స్వప్న, లక్ష్మి యాదవ్, పుష్పలత, రాజేశ్వరి, మాధవి పాల్గొన్నారు.