3 March, 2026 | 4:15 PM

కలర్ ఫుల్.. సంబరంగా హోలీ వేడుకలు

03-03-2026 02:51 PM

సుల్తానాబాద్(విజయక్రాంతి): అవని రంగుల మాయమైంది. సప్త వర్ణాలు పరుచుకుంది. హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హోలీ ఘనంగా జరుపుకున్నారు. రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు చిన్న పెద్ద తేడా లేకుండా  రంగుల జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, పలు సంఘాల వారు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లోనూ హోలీ వేడుకలు అంబరాన్ని ఉంటాయి.

జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ ఆధ్వర్యంలో  వాకర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఇందులో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), చొప్పరి సుమన్, అమిరీశెట్టి తిరుపతి, అమెరి శెట్టి రాజలింగం, చిలగాని లక్ష్మయ్య, పెగడ పరశురాములు, కొలిపాక రవీందర్, గంధం రాజేష్, పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొన్నారు, సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి క్విన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్, అల్లంకి లింగమూర్తి, తొడుపునూరి రాజేంద్రప్రసాద్, మాడురి సందీప్, చకిలం వెంకటేశ్వర్లు, పల్లా అనిల్, పల్ల సంతోష్, పల్ల సురేష్, రామిడి రవీందర్, పుల్లూరి రమేష్, నార్ల శ్రీనివాస్, కొమురవెల్లి హరీష్, నాగమల్ల ప్రశాంత్, కాసం సత్యనారాయణ, శివనాత్రి ప్రసాద్, బాదం వాణి, రామిడి లత, నార్ల మాధవి, అల్లంకి కౌసల్య, చకిలం సుమతి, కొమురవెల్లి శివ లీల, పల్లా అపర్ణ, పల్లా వనిత, జేశెట్టి సుమ, వల్ల కొండ రజిత, కొమురవెల్లి అక్షిత తో పాటు పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య భవన్ లో అందరూ కలిసి చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని వాడల్లోనూ హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోగా సుల్తానాబాద్ పట్టణం కలర్ ఫుల్ గా కనిపించింది.