15 March, 2026 | 7:23 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అమ్మవారిని దర్శించుకున్న నాయకులు

03-03-2026 03:44 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో అమ్మవారిని మంగళవారం ఆదివాసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు దర్శించుకుని మండె మెలిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 3 నుంచి 7 వరకు జరగనున్న శ్రీ నాగులమ్మ మహా జాతర విజయవంతం కావాలని, ప్రజల అందరి కోరికలు నెరవేరుస్తూ, అందరు సుభిక్షంగా ఉండేలా దీవించాలని అమ్మ వారిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ), పూజారులు బాడిశ నాగ రమేష్, కొమురం ధనలక్ష్మి, బాడిశ నవీన్, ఆదివాసి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు గొప్ప సమ్మారావు, కొండ చెంచయ్య, మద్దెల అంజయ్య, జబ్బ రవి, గుండం పురుషోత్తం, చౌలం కృష్ణమూర్తి,  కొమరం అశోక్, బొగ్గం సర్వేశం, వాసం సారంగపాణి, మల్లికార్జున రావు, కొమరం. రామనాధం  తదితరులు పాల్గొన్నారు.