08-12-2025 01:00:23 AM
ప్రపంచ ఆర్థిక శిఖరానికి తెలంగాణను చేర్చడమే లక్ష్యం
-ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి నాంది
-అడ్డంకులెదురైనా సంక్షేమం, అభివృద్ధికే పాటుపడతా
-ప్రజా పాలనలో అన్ని వర్గాలకు న్యాయం
-రెండేళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ద్వారా ప్రజా ప్రభుత్వ లక్ష్యా న్ని ప్రపంచానికి తెలియజెప్పాలని అనుకుంటున్నాం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రపంచ శిఖరానికి చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. ఎన్ని అడ్డంకులు.. అవమానాలు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమం కోసమే పాటు పడుతున్నా... నా ఊపిరి ఉన్నం త వరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగుండదు’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు.
తన రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆదివారం ఎక్స్ వేదికగా వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి నాంది అని పేర్కొన్నారు. నిన్న టి వరకు ఒక లెక్క.. రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క’ అని సీఎం తెలిపారు.
రైతుకు వెన్నుదన్నుగా..
గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని పేర్కొన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థ్థికంగా మద్దతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపామన్నారు.. బలహీన వర్గాల వం దేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగల ఉద్యమానికి నిజమైన సార్థకత చే శాం’ అని పేర్కొన్నారు.
చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం..
చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునుదాలు వేశామన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్ఫోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందు కు సాగుతున్నామన్నారు.
సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ. 500లకే గ్యాస్, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్ని ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు అని సీఎం వివరించారు.