21 April, 2026 | 11:42 PM

బీసీల సమస్యలు పరిష్కరించాలి

02-12-2024 10:21 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునూర్ రమేష్

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను సోమవారం బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేష్ ఆధ్వర్యంలో నాయకులు కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. సంఘ భవన నిర్మాణానికి తలం కేటాయించాలని కోరారు. బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఇందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని గురుకులాలకు సొంత భావనాలు నిర్మించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, బీసీలకు ఫీజుల విషయంలో ర్యాంకుల విధానాన్ని ఎత్తివేసి ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యా వైద్యాన్ని జాతీయం చేసి ఉచితంగా అందించాలన్నారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని మరణాలపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల జక్కయ్య, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లాహుకుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసే శంకర్, జిల్లా నిరుద్యోగ చైర్మన్ పోన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.