మజ్లిస్ ప్రసన్నంలో రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు రూల్ బుక్స్
మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా?
రేవంత్ పక్షపాత పాలనకు హైడ్రానే నిదర్శనం
ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఫాతిమా కాలేజీపై మౌనమెందుకు?
అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అమలు చేయాలి
ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మజ్లిస్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం ఉన్నదని, మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ పక్షపాత పాలనకు హైడ్రానే ఓ నిదర్శనమని విమర్శించారు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు రూల్ బుక్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఫాతిమా కాలేజీపై మౌనమెం దుకు? అని నిలదీశారు. ప్రజలందరికీ ఒకే చట్టం.. ఒకే న్యాయ సూత్రా న్ని అమలు చేయాలన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ట్వీట్ చేశారు. భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇందు కోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోందని తెలిపారు. అదే సమ యంలో మజ్లిస్ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదని విమర్శించారు.
రేవంత్ సర్కార్.. సెలక్టివ్ గవర్నెన్స్ (పక్షపాత పాలన)కు హైడ్రా ఓ ఉదాహరణ అని తెలిపారు. సామాన్య ప్రజ ల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం... సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిష్టర్ ఫాతి మా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ.. మీన మేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు.
హైకోర్టు చివాట్లు పెట్టినా..
తెలంగాణ హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని, ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హైడ్రా, విద్యాశాఖ సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా.. సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదని తెలిపారు. కాంగ్రె స్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్న ట్లుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా తప్పు... హైడ్రా చర్యల వల్ల పేద ముస్లింల ఇళ్లు కూడా కూల్చివే యబడ్డాయని, వారి జీవనోపాధి దెబ్బతిన్నదని, ఆ సమయంలో వారి తరఫున మజ్లిస్ గానీ, కాంగ్రెస్ గానీ ఒక్క మాట కూడా మాట్లాడ లేదన్నారు. కానీ ఒవైసీ సోదరుల ఆస్తులవిషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒకే ఆలోచనతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
భూములు, చెరువులు..ప్రజల సొత్తు
ముస్లిం సమాజంపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమలేదు.. తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లుగా, మజ్లిస్ ప్రయోజనాలకు కాపాడేలా.. రేవంత్ సర్కారు వ్యవహరి స్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలను, మజ్లిస్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసింది. ఈ ఇద్దరికీ.. తాము ముస్లిం సమాజానికి ప్రతినిధు లం అని చెప్పుకునే హక్కులేదని ఈ విషయం తేటతెల్లం చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
పేదల కోసం బుల్డోజర్లతో విధ్వంసం.. కాంగ్రెస్ మజ్లిస్ రాజకీయ వ్యవస్థ కోసం నిరంతర రక్షణవ్యవస్థ ఉంటుందని, ఈ ప్రభు త్వం తన ప్రాధాన్యతలను ప్రజల ముందే స్ప ష్టంగా వెల్లడించిందన్నారు. ప్రజల భూము లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు.. తెలంగాణ ప్రజల సొత్తు అని, రాజకీయ అండదండలు ఉన్నవారి వ్యక్తిగత ఆస్తులు కావన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అమలుచేయాలన్నారు. ప్రజలు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు.






