6 July, 2026 | 2:48 AM

రెన్యూవల్ టెన్షన్!

06-07-2026 01:42 AM
  1. కార్పొరేషన్ పదవుల్లో  కొనసాగింపెవరికి.. కొత్తగా ఛాన్స్ ఎవరికి?   
  2. 8వ తేదీతో 37 మంది పదవీకాలం పూర్తి
  3. 10 నుంచి 15 మందికి రెన్యూవల్!    
  4. ఆశావహులు ఫుల్, ప్రయత్నాలు ముమ్మరం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి) :  రెన్యూవల్ దక్కేది ఎవరికి.. గుడ్ బై చెప్పేది ఎవరికి? కార్పొరేషన్ పదవుల పునర్నియామకంపై అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొం ది. పదవుల్లో కొనసాగాలనే ప్రస్తుత చైర్మన్ల ప్రయత్నాలు ఒక వైపు.. కొత్త అవకాశాల కో సం ఆశావహుల లాబీయింగ్ మరో వైపు ఊపందుకోవడంతో రాజకీయ సమీకరణా లు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వం మొదటి విడతలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.

రెండో దఫాలో 18 కుల సంఘా ల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైఎస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే మొదటి విడతలో నియామకమైన చైర్మన్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. వీటితో పాటు ఆర్టీసీ, బేవరేజెస్, హౌజింగ్, పవర్ ఫైనాన్స్, మూసీ రి వర్‌ఫ్రంట్, మెడికల్ ఇన్‌ఫ్రాస్టక్చర్, ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్టక్చర్, ఖాదీ బోర్డు, రెడ్కో, పొ ల్యుషన్ కంట్రోల్ బోర్డు, కులిబ్‌కుత్‌బుషా అభివృద్ధి సంస్థ, ఫార్మసీ కౌన్సిల్, పుడ్ కమిషన్, లీగల్ సర్వీసెస్ అథారిటీతో పాటు మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును ఏడాది క్రితం నియమించినా..

ఇంకా చార్జ్ తీసుకోలేదు. ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఖాళీ కానున్న పోస్టులు, భర్తీ చేయని పోస్టులను  త్వరలోనే  భర్తీ చేస్తారనే  ప్రచారం ఉంది. అయితే  ప్ర స్తుతం చైర్మన్లుగా కొనసాగుతున్న వారిలో ఎంత మంది రెన్యూవల్ అవుతారు? కొత్తగా ఎవరిని నియమిస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గా ల్లో  సాగుతోంది. 37 మంది పదవీకాలం ముగిసిన ఒకటి, రెండు రోజుల్లోనే భర్తీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

చైర్మన్ల పనితీరుపై సీఎం వద్ద నివేదిక

కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు, పార్టీకి, ప్రభుత్వానికి తీసుకొచ్చిన మైలేజ్? ప్రామాణికంగా నామినేటెడ్ పదవులు పట్టబెట్టను న్నట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి నివేదికలు తెప్పించుకున్న ట్లు సమాచారం. ఇందులో ఎవరు మంచిగా పని చేశారు.. వివాదాలకు దూరంగా ఉం టూ పార్టీని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసిన వారి జాబితాను సిద్ధం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. పార్టీని, ప్రభుత్వా నికి మంచి పేరు తీసుకొచ్చిన  వారికి మరొక మారు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి  ఫిక్స్ అయినట్లుగా చర్చ జరుగుతోం ది.

37 మందిలో 10 నుంచి 15 మందిని పదవుల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ  చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సా యికుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మ న్ ముత్తినేని వీరయ్య, ఫుడ్  కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, ఈరవత్రి అనిల్, ప్రీత మ్, ఎండీ రియాజ్, పటేల్ రమేష్‌రెడ్డి, కాల్వ సుజాత, అన్వేష్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డికి రెన్యూవల్ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అ యితే వీరికి మళ్లీ అవే పదవులు దక్కుతా యా లేక మార్పులు చేర్పులు ఉంటాయా? అన్నది  సస్పెన్స్‌గా మారింది.

పార్టీ కోసం కష్టపడిన వారికే.. 

కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమవంతు పాత్ర పోషించిన కొందరికి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం లభించినప్పటికీ.. ఇంకా కొంత మందికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. వీరంతా నామినేటెడ్ పోస్టుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్ నేత ఆర్.లక్ష్మణ్‌యాదవ్, కొండేటి మల్లయ్య, లింగం యాదవ్, గౌరీ సతీష్, బండి సుధాకర్ గౌడ్, సత్యం శ్రీ రం గం, పవన్ మల్లాది, జ్ఞాన సుందర్, రాచ మల్ల సిద్ధేశ్వర్, రవళిరెడ్డి, ఇందిరా శోభన్, సునీతరావు, వరలక్ష్మి.. ఇలా ఎవరికి వారు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరిలో కొందరు  అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆ శించారు. ఆర్. లక్ష్మణ్‌యాదవ్ (అంబర్‌పేట), కొండేటి మల్లయ్య (నకిరేకల్ ), గౌరీ సతీష్ (రాజేంద్రనగర్), సత్యం శ్రీరంగం (కూకట్‌పల్లి), రాచమల్ల సిద్ధేశ్వర్ ( చేవెళ్ల ), బండి సుధాకర్‌గౌడ్ (పాలకుర్తి) ఎమ్మెల్యే   టికెట్ ఆశించగా.. అప్పటి పరిస్థితుల కారణంగా టికెట్ ఇవ్వడం కుదరలేదు. అధికారంలోకి వచ్చకా సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు పూర్తయినా న్యాయం దక్కడం లేదనే అసంతృప్తితో చాలా మంది నాయకులు ఉన్నారు.