5 September, 2026 | 7:15 AM

ప్రజా పాలనలో పేదలకు లబ్ధి

05-09-2026 | 04:05am

n రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి

n డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం సీఎం రే వంత్ రెడ్డి(CM Rayvanth Reddy) ప్రజా పాలనలో(Public governance) పేదలకు లబ్ధి జరుగుతోందని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత(Punna Kailas Neta) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ నుండి క్లాక్ టవర్ వరకు 1000 రోజుల విజయాలపై వికాస యాత్ర(Vikas Yatra) నిర్వహించారు. క్లాక్ టవర్(Clock Tower) వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సీఎం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, దళిత బహుజన ఆత్మీయ బంధువుగా మారారని కొని యాడారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక ల బ్ధి జరిగేలా చేశారన్నారు. సన్న బియ్యం, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, వ డ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, 10 లక్షలతో ఆరోగ్యశ్రీ, వైయస్సార్ ప్రారంభించిన బంగారు తల్లి లో ఇద్దరు ఆడపిల్లలకు లక్ష రూపాయలు అందిస్తున్నారన్నారు.

ఇటువం టి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. సాగు, తాగునీటి కోసం పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి చేస్తున్న రైతు బాంధవుడని పేర్కొన్నారు. పేదలు బీదల అభ్యున్నతి కోసం రో జుకు 18 గంటలు పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్, కేటీఆర్ విమర్శించడం దుర్మార్గమన్నారు.

2029లో మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్, ఎ స్సీ సెల్ అధ్యక్షుడు బోడ స్వామి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగని మాధ వి గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ముం తాజ్ అలీ, ప్రధాన కార్యదర్శులు పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి చర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు