టీజీపీ ట్రిబ్యునల్ చైర్మన్ రాంరెడ్డికి శుభాకాంక్షలు
09-05-2026 12:54 AM
కడ్తాల్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన సూదిని రాంరెడ్డి గురువారం హైదరాబాద్లో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రాంరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్, నాయకులు కేశవులు పాల్గొన్నారు.






