14 August, 2026 | 7:11 PM

విద్యార్థులకు బూట్లు, దుస్తుల పంపిణీ

14-08-2026 06:38 PM

బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన 47 మంది విద్యార్థులకు రూ.10 వేల వ్యయంతో ఎలుక దేవయ్య బూట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు రంగనాథ్, మండల విద్యాధికారి మహతి లక్ష్మి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం వల్ల విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని వారు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాడ్జీలను అందించిన ఎలుక శ్రీశైలంను, పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన యువతను మండల విద్యాధికారి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య, ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రమోద్, శిరీష, హరీష్, వార్డు సభ్యురాలు రోల లక్ష్మి, మాజీ ఎంపీటీసీ ఎలుక లత దేవయ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు.