4 April, 2026 | 7:26 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు శుభాకాంక్షలు

04-04-2026 06:03 PM

 రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని శనివారం క్యాంప్ ఆఫీస్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి కలుసుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురు-శిష్యులుగా వరంగల్ జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకుని, అప్పటి కష్టసుఖాలను పంచుకుంటూ ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఈ రోజు ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, మరొకరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి భార్య లక్ష్మి సర్పంచ్ గా ప్రజాసేవలో ముందున్నారు. వారి ఆప్యాయ అనుబంధం మరలా గుర్తు చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకంగా గుర్తించబడింది.పోలీస్ శాఖలో ఆదర్శంగా పనిచేసిన వీరు, ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని, ఇప్పుడు తమ జీవితాన్ని మళ్లీ  ప్రజలకు అంకితం చేయడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వారి సేవా భావాన్ని చూసి పలువురు అభినందనలు తెలిపారు.