29 June, 2026 | 4:06 PM

కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం

17-04-2026 09:20 PM

కామారెడ్డి జిల్లాలో తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం

టీఆర్‌పీ శ్రేణులు సంబరాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టేందుకు కృషి చేసిన టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నిరంతర పోరాట ఫలితంగా రిపోర్టు బయటకు వచ్చిందని, రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శుక్రవారం రాజాధికార పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ మాట్లాడుతూ శాసన మండలిలోనూ, అన్ని వేదికల మీదా ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించి, ఎన్నో అవమానాలు ఉన్నప్పటికీ లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి రావడానికి మల్లన్న అకుంఠిత కృషి ప్రధాన కారణమని నాయకులు స్పష్టం చేశారు.  

ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ తాహెర్  ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టుదల, మల్లన్న గారి అకుంఠిత కృషి రెండు కలిసి నేడు మన కులాల లెక్కలు బయటకు వచ్చాయి అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు అడిగితే ఇవ్వకపోవడంతో మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. 94% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలిసి బీసీ రాజ్యాధికారాన్ని త్వరలోనే తీసుకువస్తామని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు కల్లెం రాజు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు సింగడపు సిద్దయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూంపల్లి అనిల్, నాయకులు బెజుగం శ్రీనివాస్, .తుకారాం తదితరు లు పాల్గొన్నారు.