30 June, 2026 | 11:26 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మెరుగైన వైద్య సేవలు అందించాలి

12-04-2025 06:23 PM

మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించాలి..

AAS ఆజాద్ అధికార్ సేన పార్టీ జిల్లా ఇంచార్జ్ ప్రేమ్ దయాళ్..

భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ప్రధాన ఆసుపత్రి CMO చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆజాద్ అధికార్ సేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్. ఇందులో భాగంగా పలు అంశాలపై ప్రస్తావించగా సానుకూలంగా స్పందించిన CMO అమలు దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ బోర్డు నిర్వహణ పారదర్శకంగా నిర్వహించి మెడికల్ బోర్డ్ లో కార్మికులకు నష్టం వాటిల్ల కుండా న్యాయం చేయాలని అన్నారు.

సింగరేణి వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి సిబ్బందికి పని భారం తగ్గించాలని, వైద్యానికి అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. మందుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని కోరారు. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించాలని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.