15 March, 2026 | 11:47 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

అవమానాలను దాటి.. అన్యాయాన్ని ఎదిరిస్తూ..

22-07-2024 02:33 AM

నరబలుల పేరిట జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాలు విసురుతుంటే.. అదే శాఖలో ఉంటూ కేసులను ఛేదిం చే ప్రయత్నాల్లో ఉన్న బృంద పురుషులైన అధికారుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సస్పెన్షన్ వేటుకు కూడా గురైంది. ఆమె కథ ఏమిటి? ఆ నరబలుల కేసు ఎలా పరిష్కారమైంది? తెలియాలంటే ‘బృంద’ని కలుసుకోవాల్సిందే అంటున్నారు కథానాయకి త్రిష. ఆమె నటిస్తున్న మొట్ట మొదటి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఇందులో ఆమె అవమానాలు దాటి.. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ అధికారిగా కనపడనున్నారు. సూర్య మనోజ్ వంగాల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి తదితరులు నటించిన ఈ సిరీస్ తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ లభ్యం కానున్నట్టు మేకర్స్ తెలిపారు. దర్శకుడితో పాటు పద్మావతి మల్లాది స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి దినేష్ కె బాబు, శక్తికాంత్ కార్తీక్, అవినాష్ కొల్ల, అన్వర్ అలీ సాంకేతిక విభాగాల్లో పనిచేశారు.